సిరా న్యూస్,హైదరాబాద్;
కెనడాలోని టొరంటోలో ఘటన కెనడాలోని టొరంటో సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టొరంటో సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఓ టెస్లా కారు రోడ్డు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు భారతీయులు సజీవ దహనమయ్యారు. మృతు ల్లో ఇద్దరు గుజరాత్లోని గోద్రాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. తెలిసిన వివరాల ప్రకారం..గోద్రాకు చెందిన కేతా గోహిల్ (30), నిల్ గోహిల్ (26), మరో ఇద్దరు వ్యక్తులతో టెస్లా కారులో గురువారం అర్ధరాత్రి ప్రయాణిస్తున్నారు. అయితే, వీరు ప్రయాణి స్తున్న కారు టొరంటో సమీపంలోకి రాగానే డివైడర్ను ఢీ కొట్టింది. తరువాత కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం తరువాత కారు బ్యాటరీకి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే కెనడా పౌరసత్వం పొందిన వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో మరణించా డు. రోడ్డుపై ఇతర వాహన దారులు కారులోని వారిని రక్షించేందుకు యత్నిం చారు కారు అద్దాలు పగలగొట్టి వారిని రక్షించేం దుకు యత్నించారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.