గుంటూరు ఆర్టీసీ డిపో కి 100 విద్యుత్తు బస్సులు

ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు
సిరా న్యూస్,గుంటూరు;
100 విద్యుత్తు బస్సులను గుంటూరు ఆర్టీసీకి కేటాయించనున్నారు. ఇందులో 20 బస్సులు అల్ట్రా డీలక్స్ సర్వీసులుగా నడుస్తాయి. మిగతా బస్సులన్ని పల్లెవెలుగు బస్సుల కింద తిప్పుతారు. వీటిని ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు నడుస్తాయి. ప్రస్తుతానికి 100 కిలోమీటర్ల లోపు దూరం ఉన్న ప్రాంతాలకే వీటిని ఉపయోగిస్తారు. వీటికి ఛార్జింగ్ స్టేషన్ ను పెదకాకాని బస్టాండ్ వెనక ఆర్టీసీకి ఉన్న 3.5 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు.
భవిష్యత్తులో ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి వస్తే పల్నాడు బస్టాండ్ లో కూడా ఏర్పాటు చేస్తారు. గుంటూరులో ప్రధానంగా కాలుష్యం ఎక్కువవుతుండటంతో దీన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించిన ఎక్స్ ప్రెస్ బస్సులను పల్లెవెలుగు బస్సుల్లా మార్చి తిప్పుతున్నారు. అయితే వీటి నిర్వహణ వ్యయం బాగా పెరుగుతుండటంతో విద్యుత్తు బస్సుల వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. త్వరలోనే ఈ బస్సులు రాష్ట్రానికి రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *