కేటీఆర్
సిరా న్యూస్;
ప్రభుత్వానికి అక్రమ కేసులపై వున్న మోజు ఆరోగ్య శాఖపై లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అడ్డగోలు సంపాదన పై మోజు, పెద్దాసుపత్రుల ఆలన పాలన పై లేకపాయే. కుటిల రాజకీయాలపై ఉన్న మోజు – రోగుల కష్టాలపై లేకపాయే. ముళ్ల కంచెలపై ఉన్న మోజు – ఆసుపత్రుల్లో మందుల కొరతపై లేకపాయే. పోలీసు ఉద్యోగాలు ఊడపీకడంపై ఉన్న మోజు – ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత పై లేకపాయే. గుండె పట్టేస్తుంది ఆయాసంగా ఉందనివస్తే పక్కనున్న ప్రయివేట్ ఆసుపత్రికి పొమ్మనబట్టే పైసలే ప్రామాణికమైన మీ పైసల పాలనలో అన్ని రంగాల్లో అవేదనలు, అవస్థలు, అన్యాయాలే అని ఎక్స్ వేదికగా విమర్శించారు.
కాంగ్రెస్ మాపై చేస్తున్న రాజకీయ వేధింపుల ప్రహసనంలో గత రెండు రోజుల్లో జరిగిన పరిణామాలన్నీ ప్రారంభం మాత్రమే
రానున్న రోజుల్లో మరిన్ని వేధింపులు ఉంటాయి
మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులకు, సోషల్ మీడియా వారియర్లకి ధన్యవాదాలు
కాంగ్రెస్ పార్టీ చేసే వ్యక్తిగత దాడులను, కుట్రలను, ప్రాపగాండాను, అబద్దాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం
కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా డిఫ్ ఫేక్ టెక్నాలజీ వంటి అనేక అంశాల సహకారంతో వారి పెయిడ్ ఆర్టిస్ట్ లతో చేసే దుర్మార్గపూరిత కుట్రలు చూడాల్సి వస్తది…
బిజెపి,కాంగ్రెస్, టిడిపి, వారి పెయిడ్ సోషల్ మీడియా అంతా కలిసి బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయబోతున్నారు
ఇలాంటి కుటిల ప్రయత్నాలతో అయోమయానికి గురి కావడం, ఆగం కావడం మనకు అవసరం లేదు
ఇలాంటి కుటిల ప్రయత్నాల వలన ప్రజా సమస్యల పైన మనం చేస్తున్న పోరాటం నుంచి పక్కకు జరగవద్దు
తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న మన పోరాటం పైనే దృష్టి సారిద్దాం
కాంగ్రెస్ పార్టీ అవినీతిని, అసమర్ధతను, హిపోక్రసీని ఎత్తిచూపుదాం
. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల అమలుకై వారి పైన ఒత్తిడి తీసుకువద్దామని అన్నారు.