సిరాన్యూస్, ఓదెల
క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు : ఎమ్మెల్యే విజయరమణ రావు
* చదువులతో పాటు క్రీడలు అవసరం
రానున్న రోజుల్లో క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉందని, క్రీడలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తిగా ఉన్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. మంగళవారం పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబా పూలే విద్యాలయంలో నిర్వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఎంజెపి విద్యాలయాల టోర్నమెంట్స్, సెలక్షన్స్ ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయరమణ రావు ముఖ్య అతిధిగా హాజరై గెలుపొందిన విద్యాలయాల జట్లకు బహుమతులను అందించారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ దేహదారుధ్యానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. ఇందులో భాగంగానే సీఎం కప్ 2024 నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో, ఒలంపిక్స్ క్రీడల్లో తెలంగాణ సత్తా చాటి చెప్పాలన్నది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. రానున్న రోజుల్లో క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మినిపల ప్రకాష్ రావు,వెంకటరమణా రావు,లాబు రవి, అబ్బయ్య గౌడ్, సాయిరి మహేందర్, చిలుక సతీష్, జానీ మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు పాఠశాల యాజమాన్యం, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.