సిరా న్యూస్,హైదరాబాద్;
ఈ విషయంపై తెలంగాణ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రం, అందులోనూ పక్క రాష్ట్రమైన తెలంగాణను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఏపీ ఎమ్మెల్యేల లెటర్లు తెలంగాణ టెంపుల్స్‌లో యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులు ఎందుకు అనుమతించరని క్వశ్చన్ చేస్తున్నారు.తిరుమల దర్శనాలకు సంబంధించి..కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏపీ ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తిరుమలలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను అనుమతించకపోతే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రోళ్లకు ఇక్కడ ఆస్తులు కావాలట. మన సిఫారసు లేఖలు చెల్లవటా అంటూ అనిరుధ్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేలందరం కలిసి వీఐపీ లెటర్లు చెల్లేలా ఒత్తిడి తీసుకొస్తామని..లేదంటే చంద్రబాబు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదని సంచలన కామెంట్స్ చేశారు. ఆస్తుల కోసం, వ్యాపారం కోసం తెలంగాణకు వస్తారు కానీ తిరుమలలో మనకు గౌరవం కల్పించరా అని ప్రశ్నించిన అనిరుధ్ రెడ్డి. ఆ దేవుడే మీకు బుద్ధి చెప్తారని చంద్రబాబుకు శాపనర్ధాలు కూడా పెట్టేశారు.జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాత్రమే కాకుండా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను స్వీకరించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆ మధ్య ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైనప్పుడు తిరుమల దర్శనాలకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను అనుమతించేలా విజ్ఞప్తి చేయాలని మంత్రి కొండా సురేఖ రేవంత్‌ను కోరారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు ముందు ఈ అంశాన్ని లేవనెత్తారో లేదో గాని.. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను మాత్రం టీటీడీ పక్కనపెట్టేస్తోంది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏపీ ప్రభుత్వంపైనా, చంద్రబాబుపైనా విమర్శలు చేయడంతో పాటు హెచ్చరించే వరకు వెళ్తున్నారు.ఇప్పుడు ఈ అంశం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారిందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేల డిమాండ్స్‌ను ఏపీ ప్రభుత్వం ముందు ఉంచక తప్పదా అని రేవంత్ ఆలోచిస్తున్నారట. ఈ విషయంపై నేరుగా ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడితే తప్ప తేలదు కనుక, సమయం, సందర్భం చూసి మాట్లాడాలనుకుంటున్నారట రేవంత్. టీడీపీ బోర్డులో తెలంగాణకు ప్రాతినిధ్యం ఉంటుంది కాబట్టి..ఆ టైమ్‌లో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల ప్రస్తావించాలనుకుంటున్నాటరు రేవంత్.