కౌలు రైతుకు పది లక్షలు నష్టం
సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో కవులు రైతు మట్టా రామారావుకి 10 లక్షల నష్టం వాటిల్లింది. బాధితుడు మట్టా రామారావు తెలిపిన వివరాలు ఈలా ఉన్నాయి 25 ఎకరాల్లో సాగు చేసేందుకు నాటు పొగాకు నారుమళ్లు కౌలు రైతు మట్టా రామారావు సిద్ధం చేశారు. నాటు పొగాకు సాగుకు అవసరమైన కలపను సిద్ధం చేసుకున్నారు కలపను రెండు ప్రాంతాల్లో గుట్టలుగా ఏర్పాటు చేసుకున్నారు మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పొగాకు కలపను దగ్ధం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు ధర్మాజీగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు బుధవారం ఉదయం రామారావు పొలానికి 25 ఎకరాల్లో సాగు చేసేందుకు సిద్ధంగా ఉంచిన పొగాకు నారుమల్లు మాడిపోయి కనిపించాయి రాత్రి సమయంలో దుండగులు నారుమళ్లపై కలుపుమందు పిచికారి చేసి ఉంటారని అలాగే కలపను దగ్ధం చేశారని మట్ట రామారావు పేర్కొన్నారు.