ఎనిమిది మందిపై అట్రాసిటీ కేసు నమోదు

సీఐ దొర రాజు
సిరా న్యూస్,మండపేట;
ముగ్గురు దళిత యువకులపై అగ్రవర్ణాల దాడి ఘటనలో ఏడిద గ్రామానికి చెందిన ఎనిమిది మంది పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు మండపేట రూరల్ సీఐ పి. దొర రాజు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన మాట్లాడుతూ 8 మందితో పాటు మరి కొందరు ఈ కేసులో నిందితులుగా వున్నారని, వారందరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం చేసే విషయం లో కొన్ని వివరాలు వెల్లడి చేయడం కేసు పురోగతికి అడ్డు వస్తుందని వెల్లడించేందుకు నిరాకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *