సిరా న్యూస్,సిద్దిపేట;
నాగసాదు అఘోరీ ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్వగ్రామానికి తరలించారు. దీపావళి రోజున హైదరాబాద్ ముత్యాలమ్మ గుడిలో ఆత్మార్పణ చేసుకుంటానని అఘోరీ ప్రకటించిన విషయం తెలిసిందే. సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకుని స్వగ్రామమైన నెన్నెల మండలం కుశ్నపల్లిలో తల్లిదండ్రుల వద్దకు తరలించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి రాజన్న ఆలయ ఆవరణలోని దర్గాను కూల్చివేయాలని అఘోరి కామెంట్ చేసింది. శుక్రవారం ఆత్మార్పణ చేసుకుంటానని పెట్రోల్ క్యాన్ కారులో పెట్టుకుని తిరుగుతోంది. సిద్దిపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని స్వగ్రామానికి తరలించారు.