Congress Party Kandi Srinivasa Reddy: ప్ర‌భుత్వ ప‌థ‌కాల పంపిణీలో ఎమ్మెల్యే కుట్ర : కంది శ్రీ‌నివాస రెడ్డి

సిరా న్యూస్,ఆదిలాబాద్‌
ప్ర‌భుత్వ ప‌థ‌కాల పంపిణీలో ఎమ్మెల్యే కుట్ర : కంది శ్రీ‌నివాస రెడ్డి
* పాయ‌ల్ శంక‌ర్ అండ‌తో అధికారుల నిర్ల‌క్ష్యం పై మండిపాటు
* స‌ద‌రు అధికారుల ను స‌స్పెండ్ చేయాలి

ఆదిలాబాద్ జిల్లా బేల మండ‌ల కేంద్రంలో జ‌రిగిన దండారి చెక్కుల పంపిణీలో అధికారుల నిర్ల‌క్ష్యాన్ని ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి త‌ప్పుబ‌ట్టారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అందిస్తున్న చెక్కుల పంపిణీలో సీఎం,మంత్రుల ఫోటోలు బ్యాన‌ర్ లేకుండా ఎలా పంపిణీ చేస్తారంటూ మండిపడ్డారు. మండ‌ల కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌శ్నిస్తే బ్యాన‌ర్ పెట్టం ఎవ‌రికి చెప్ప‌కుంటారో చెప్పుకోండి అని స‌ద‌రు అధికారి అవ‌మానక‌ర రీతిలో మాట్లాడ‌టంపై మండిప‌డ్డారు. ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ అండ చూసుకుని అధికారులు ప్ర‌భుత్వ ప‌థ‌కాల విష‌యంలో ప్ర‌భుత్వానికి క్రెడిట్ ద‌క్క‌కుండా కుట్ర చేస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. వెంట‌నే స‌ద‌రు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్ర‌భుత్వ బ్యాన‌ర్ పెట్ట‌కుండా త‌న సొంత డబ్బులు పంచినట్టు ఫోజులు కొడుతున్నాడని విమర్శించారు. అధికారులు పాయల్ శంకర్ ఉచ్చులో పడొద్దని సూచించారు. నిజంగా పాయ‌ల్ శంక‌ర్ కు ఆదివాసీల పై ప్రేముంటే ..నిధులు తీసుకొచ్చే ద‌మ్ముంటే కేంద్రం నుండి ప్ర‌తీ దండారికి మ‌రో 15 వేలు ఇప్పించాల‌ని డిమాండ్ చేసారు. కాని ఆయ‌న అధికారుల‌ను బెదిరించి సీయం మంత్రుల‌తో కూడిన ప్ర‌భుత్వ బ్యాన‌ర్ పెట్ట‌కుండా మ‌రోమారు ఇలా వ్య‌వ‌హ‌రిస్తే బాగుండ‌ద‌ని హెచ్చ‌రించారు. ఇటీవ‌లి క‌ళ్యాణ ల‌క్ష్మి , షాదీ ముబార‌క్ చెక్కుల పంపిణీలో కూడా ఇలాగే జ‌రిగింద‌ని ఆరోపించారు.కాంగ్రెస్ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ల‌బ్దిదారుల‌కు అందించే విష‌యంలో ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ కావాల‌నే త‌మ ప్ర‌భుత్వానికి ఆ క్రెడిట్ ద‌క్కుండా చేయాల‌ని చూస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఎమ్మెల్యేకు వ‌త్తాసు ప‌లుకుతున్న‌ అధికారుల‌కు ఆయ‌న వ‌ల్ల ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్నారు. ప్ర‌భుత్వ కార్యక్ర‌మంలో సీయం , సంబంధిత మంత్రుల ఫోటోల‌తో బ్యాన‌ర్ లేక పోవ‌డం ముమ్మ‌టికి త‌ప్పేన‌న్నారు. క‌లెక్ట‌ర్ ,ఐటీడీఏ పీవో స‌ద‌రు అధికారులపై త‌గు చ‌ర్య‌లు తీసెకోవాల‌ని కోరారు. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వ దృష్టికి సైతం తీసుకెళ్తామ‌న్నారు.ఈ మీడియా స‌మావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు,లోక ప్రవీణ్ రెడ్డి,ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా అధ్యక్షులు రంగినేని శాంతన్ రావు,కౌన్సిలర్లు బండారి సతీష్,యెల్మెల్వార్ రామ్ కుమార్,సంద నర్సింగ్,ఆదిలాబాద్ రూరల్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్చెట్టి నాగన్న,నాయకులు కిజర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *