Gas Agency Manjula: దీపం-2 పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు బాగుందా మంజుల

సిరాన్యూస్, కుందుర్పి
దీపం-2 పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు బాగుందా మంజుల

దీపం-2 పథకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు బాగుందా మంజుల అన్నారు. శ‌నివారం కుందుర్పి భారత్ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో దీపం -టును కార్యక్రమాన్ని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు బాగుందా మంజుల అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్, ఆర్ఐ, విఆర్ఓ, హాజరయ్యారు. ఈసంద‌ర్బంగా వారు మాట్లాడుతూ దీపం-2 పథకంలో భాగంగా ఈ ఉచిత సిలిండర్లను ప్రభుత్వం అందిస్తుందన్నారు.అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం ఇవ్వనున్నారని తెలిపారు. దీంతో పేదలపై గ్యాస్ భారం తగ్గుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను 4 నెలలకు ఒకటి చొప్పున లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారని తెలిపారు. స‌మావేశంలో గ్యాస్ వినియోగదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *