సిరా న్యూస్,విజయవాడ;
తాటిపర్రు ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి చేసారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ కు గురై మృతి చెందిన మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.జ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అధైర్య పడవద్దని, ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ధైర్యం చెప్పారు.