సిరాన్యూస్, ఇంద్రవెల్లి :
సర్వే కాలం 5లో బౌద్ధమతంగా నమోదు చేసుకోవాలి :భారతీయ బౌద్ధమహసభ ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు ప్రభాకర్ గడపాలే
* కరపత్రాలను విడుదల
ఈనెల 6 తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణన సర్వేలో ఎస్సీ మహార్ కులస్తులు కాలం నంబర్ 5లో తమ మతాన్ని బౌద్ధ మతాన్ని నమోదు చేసుకోవాలని భారతీయ బౌద్ధ మహాసభ ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు ప్రభాకర్ గడపాలే అన్నారు.సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో బౌద్ధ అనుయాయులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ 14 అక్టోబర్ 1956 నాగపూర్ దీక్ష భూమి కేంద్రంగా 5లక్షల మందితో బౌద్ధ మతాన్ని స్వీకరించారన్నారు.1990 సంవత్సరంలో మాజీ ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలో బౌద్దులకు రిజర్వేషన్ కల్పించారని తెలిపారు.ఎస్సి మహార్ కులస్తులు బౌద్ద మతంలో మారిన వారి రిజర్వేషన్ మారదని పేర్కొన్నారు.ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న కులగణన సర్వేలో ఎస్సీ మహార్ కులస్తులు తమ మతాన్ని బౌద్ధ మతంగా నమోదు చేసుకోవాలన్నారు. అదేవిధంగా కులం కాలంలో ‘మహార్ గా’ నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహాసభ ఉత్తర తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఝాడే ప్రజ్ఞశిల్, జిల్లా కోశాధికారి కాంతరావ్ వాగ్మారే,అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల ప్రధాన కార్యదర్శి వాగ్మారే కాంరాజ్,భీం ఆర్మీ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు పరత్వాగ్ సందీప్,బౌద్ధ ఉపాసకులు లాహుదాస్ సావంత్, కృష్ణ కుమార్ సోన్ కాంబ్లే, రాజ్ వర్ధన్ మస్కె,లక్ష్మణ్ కాంబ్లే,రాందాస్ గాయక్వాడ్,సుద్ధోధన్ వాగ్మారె,శివాజీ కాలే, గోపనేఆనంద్ రావ్, కొండిబా,సంజీవ్ జోందలే, జితేందర్ సోన్ కాంబ్లే, సత్యానంద్ భవాలే, సూరజ్ సోన్ కాంబ్లే, తదితరులు పాల్గొన్నారు.