మున్నూరు కాపులు సమాజానికి దిక్సూచిగా నిలవాలి

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

 సిరా న్యూస్,పెద్దపల్లి;

మున్నూరు కాపులు సమాజానికి దిక్సూచిగా నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి జిల్లా బందంపల్లిలో ఆదివారం మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్ ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మున్నూరు కాపుల్లో విభేదాలు ఉన్నా పార్టీలకు అతీతంగా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మున్నూరు కాపులు మరింత బలోపేతం చెందాలని ఆకాంక్షించారు. కాపు కులాన్ని పటిష్ఠం చేస్తూ ఇతర కులాల ఆదరణ పొందడం ద్వారా రాజకీయంగా పరింత రానించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర కులాలతో కలిసి నడిస్తే బిసిలకు రాజ్యాధికారం సరియైన వాటా దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కులాల లెక్క తేల్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే చేపడుతున్నామని, 50 ప్రశ్నలతో 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్ సర్వే చేస్తారని, సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కులగణన తర్వాత బిసిలకు 52 శాతం రిజర్వేషన్లు దక్కే చాన్సు ఉందన్నారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1పరీక్షల్లో 519 పోస్టులకు 33 వేల మంది అభ్యర్థులు హాజరు కాగా 57.11 శాతం బీసీలు ఎంపికయ్యారని గుర్తు చేశారు. ఓసీలు కేవలం 8.9శాతం మాత్రమే ఎంపికయ్యారు అన్నారు. గ్రూప్ 1 పరీక్షలపై జరిగిన రాద్దాంతం ఒత్తిదేనని తేలిందన్నారు. ఎక్కువ శాతం బీసీలు ఎంపికవ్వడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బీసీలకు కాంగ్రెస్ సర్కార్ మేలు చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధులను సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనమాల ప్రవీణ్ కుమార్, జిల్లా అధ్యక్షులు అనుమాల మహేష్, యువత రాష్ట్ర అద్యక్షులు బండి సంజీవ్, జిల్లా అధ్యక్షులు తొగరి సురేష్, నాయకులు ఎడ్ల రవి, డాక్టర్ రాజ్ కుమార్, అనిల్, కిషన్, బాలకృష్ణ, రాజేందర్, తోట కాంతయ్య, పూదరి కిషన్, దాసరి రాజేశం, కాపు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *