సిరా న్యూస్,రామచంద్రపురం;
కార్తీక మాసం మొదటి సోమవారం కావడం తో ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే ఇక్కడ కు విచ్చేసి సప్తగోదావరిలో పుణ్య స్నానాలు చేసి, ఆలయం లో శ్రీ అమ్మ వారిని శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల పంచాక్షరీ నామం తో ఆలయం మారు మోగింది. మహిళలు అరటి డొప్పలు పై దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.