సిరా న్యూస్,రంగారెడ్డి;
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ అలీనగర్ లో ముజ్రా పార్టీ గొడవ జరిగింది. స్థానికంగా వుండే కొందరు నిత్యం ట్రాన్స్ జెండర్స్ ని పిలిచి ముజ్రా పార్టీ అంటూ తప్పతాగి భారీ శబ్దంతో చెవులు చిల్లులు పడేలా స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గొడవ జరిగింది. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికుల అరోపణ. అడిగితే గొడవకు దిగుతున్నారని ముజ్రా పార్టీ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.