సిరా న్యూస్,సింహాచలం;
సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమయింది. వైకుంఠ ద్వార దర్శనానికి ఆలయ చైర్మన్ అశోక్ గజపతి రాజు , ట్రస్ట్ బోర్డ్ సభ్యులు వచ్చారు. ఆలయ అనువంశికత ధర్మకర్త అశోక గజపతిరాజుకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి సాదర స్వాగతం పలికారు. అయన తొలి ఉత్తర ద్వార దర్శనం అందుకున్నారు. తెల్లవారుజాము నుండి స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచచారు. భక్తులు ఒకేసారి స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో క్యూలైన్లు దేవస్థానం సిబ్బంది ఏర్పాటు చేసారు…