సిరా న్యూస్,హైదరాబాద్;
రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చే రోజే ప్రగతి నగర్లోని అంబర్ చెరువు దగ్గర గాంధీ జయంతి రోజు ఆవిష్కరించిన గాంధీ విగ్రహంకు అవమానం జరిగింది. స్థానిక కాంగ్రెస్ నాయకులు హడావుడితో ఏర్పాటు చేసిన ఈ విగ్రహంకు ఏర్పాటు రోజు నుండే ఆకతాయిలు అవమానపరుస్తున్నారు. గతంలో మలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. గాంధీ విగ్రహం ముందే మందుబాబులు చిందులు అని, విగ్రహంకు పెయింట్ పోయింది అని అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని స్థానికుల ఆరోపణ. గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన వాళ్ళను పట్టుకొని వెంటనే అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.