సిరా న్యూస్,నల్గోండ;
ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు…తెల్లవారుజామున మూడు గంటల నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల కోసం ఉత్తర ద్వారం గుండా మహావిష్ణుని దర్శనాన్ని కల్పించారు…. ఉత్తర ద్వారం గుండా ఆ మహావిష్ణుని దర్శించుకోవడానికి తెల్లవారుజామునుండే భక్తులు బారులు తీరారు… ఇంటి వద్ద పూజ నిర్వహించుకుని నివాళులు తీసుకొచ్చి స్వామివారికి చూయించారు…భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు వైష్ణవ ఆలయాల కమిటీలు…