రామగిరి ఖిల్లా పై ఔషధ మొక్కలు పరిశోధన చేస్తా

మంత్రి శ్రీధర్ బాబు కు వినతి పత్రం అందజేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్

సిరా న్యూస్,కమాన్ పూర్;
రామగిరి మండలంలోని రామగిరి ఖిల్లా పై ఔషధ మొక్కలను పరిశోధనలు చేస్తానని శాతవాహన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణమూర్తి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు.

హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ని కలవడం జరిగింది. శాతవాహన విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరసింహమూర్తి తో కలిసి రామగిరి ఖిల్లా మందు మొక్కలపై ప్రాథమిక పరిశోధన పత్రాన్ని మంత్రివర్యుల కి అందించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి ఆరేళ్లి కిరణ్ గౌడ్ కూడా పాల్గొన్నారు. రామగిరి ఖిల్లా కొండలపై విస్తరించి ఉన్న మందు మొక్కలు మరియు వృక్ష వైవిధ్యాన్ని గురించినటువంటి ప్రాథమిక పరిశోధనా పత్రాన్ని అంతర్జాతీయ పరిశోధన పత్రికలో ప్రచురించడం జరిగింది. దాదాపుగా 300కు పైగా పైచిలుకు మందు మొక్కలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఈ క్రమంలోనే మరింత పరిశోధన జరిపి రామగిరి జిల్లా ముందు మొక్కల గురించిన సమగ్ర సమాచారాన్ని పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ సందర్భంగా మంత్రివర్యులు స్నేహితులు దుద్దిల్ల శ్రీధర్ బాబు నీ కలిసి మరిన్ని పరిశోధనల కొరకు ప్రోత్సహం ఇవ్వాలని కోరడం జరిగింది. మంత్రి ఆ నివేదికను పరిశీలించి సానుకూలంగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *