సిరాన్యూస్, ఓదెల
జమ్మికుంట రాష్ట్రంలోని నెంబర్ వన్ శిక్షణ కేంద్రం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
* శిక్షణ కేంద్రం సందర్శన
జమ్మికుంట ప్రాంత ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడం సంతోషకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చేతి, కుల వారికి, కళాకారులకు విశ్వకర్మ యోజన పథకం శ్రీ టెక్నాలజీ సెంటర్ బోనగిరి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వకర్మ యోజన ట్రైనింగ్ సెంటర్ ను మంగళవారం స్థానిక బీజేఉపీ శ్రేణులతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సందర్శించారు. జమ్మికుంట కేంద్రంగా సుమారు 5000 మందికి వివిధ రకాల వృత్తులకు సంబంధించి ట్రైనింగ్ అందించి విశ్వకర్మ యోజన పథకాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న శ్రీ టెక్నాలజీ సెంటర్ నిర్వాహకులు శ్రీధర్ ని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అభినందించి, సన్మానించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ చేతివృత్తుల్లో పనిచేసే వెనుకబడిన వర్గాల కోసం బీజేపీ మోడీ ప్రభుత్వం పి.ఎం విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. గురు శిష్య వారసత్వ పరంపరను ప్రోత్సహించి సాంప్రదాయ పనిముట్లను, చేతులను ఉపయోగించి పనిచేసే కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు.చేతి పనులవారు, కళాకారులు చేసే ఉత్పత్తుల నాణ్యతను పెంచడం వారిని దేశీయ గ్లోబల్ మార్కెట్ తో అనుసానిందించడం ఈ పథకం యొక్క మరొక ఉద్దేశమన్నారు.అలాగే పిఎం విశ్వకర్మ సర్టిఫికెట్ తో పాటు గుర్తింపు కార్డును అందిస్తారని తొలివిడత రూపాయలు లక్ష వరకు, రెండో విడత రెండు లక్షల రుణం అందిస్తారని, దీనికి కేవలం 5శాతం వడ్డీ వసూలు చేస్తారని వివరించారు. ఇంతటి గొప్ప పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జమ్మికుంట ప్రాంత ప్రజలు ఈ పథకాన్ని సద్వినియం చేసుకొని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంటు విశ్వకర్మ యోజన కోఆర్డినేటర్ ఆకుల రాజేందర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, బిజెపి పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, పల్లపు రవి, ఇటికాల స్వరూప, తుడి రవిచంద్ర రెడ్డి, బచ్చు శివకుమార్, మోడం రాజు, రావుల శ్రీనివాస్, కొండ్లె నాగేష్, బూరుగుపల్లి రామ్, గర్రెపల్లి నిరుపా రాణి, పొన్నగంటి రవి, ముకుందం సుధాకర్, ఉడుగుల మహేందర్, కొండపర్తి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు