Artist Golada Satyanarayana : కీబోర్డు వాయిద్య కళాకారుడు గోలాడ సత్యనారాయణకు స‌న్మానం

సిరా న్యూస్,క‌రీంన‌గ‌ర్‌
కీబోర్డు వాయిద్య కళాకారుడు గోలాడ సత్యనారాయణకు స‌న్మానం
*భారత్ వరల్డ్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు

కీబోర్డు వాయిద్య కళాకారులు గోలాడ సత్యనారాయణకు భారత్ వరల్డ్ రికార్డు జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు ద‌క్కింది. ఖ్యాతి ప్రపంచ స్థాయిలో నిలిపిన సల్వాజి సంధ్య, సల్వాజి మ్యూజికల్ గ్రూప్ ఫౌండర్ సల్వాజి ప్రవీణ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సల్వాజి సంధ్య ఏకధాటిగా 6 గంటల పాటు గాయనిమని కె.ఎస్.చిత్ర పాటలను ఎంచుకొని 72 పాటలు పాడింది.ఈ కార్యక్రమంలో కీబోర్డు వాయిద్య కళాకారునిగా పెద్ద‌పెల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన గోలాడ సత్య నారాయణ 6 గంటలపాటు నిర్విరామంగా కీబోర్డు వాయించి భారత్ వరల్డ్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కో ఆర్డినేటర్ కె.వి. రమణ రావు తో పాటు కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ప్రఫూల్ దేశాయ్, కరీంనగర్ ఆర్డీవో కే.మహేశ్వర్,కరీంనగర్ ఫిల్మ్స్ సొసైటీ ప్రెసిడెంట్ పొన్నం రవిచంద్ర,జి.కృపాదానం,అనంత చారి,వి.గోపాల్ రావు, సల్వాజి మ్యూజికల్ గ్రూప్ అధినేత సల్వాజి ప్రవీణ్ రికార్డును అందజేసి శుభాకాంక్షలు తెలియ‌జేశారు. కళాకారులు,గ్రామస్తులు, తదితరులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *