సిరాన్యూస్,ఓదెల
శ్రీరామ ఫర్టిలైజర్ ఫెస్టీసైడ్స్, సీడ్స్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం, కొలనూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ.రామ ఫర్టిలైజర్ ఫెస్టీసైడ్స్ , సీడ్స్ షాపును బుధవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.ముందుగా శ్రీ.రామ ఫర్టిలైజర్ ఫెస్టీసైడ్స్ , సీడ్స్ షాపు యాజమాన్యం ఎమ్మెల్యే ని ఘనంగా సత్కరించారు. తదుపరి యాజమాన్యనికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో విజయేందర్ రెడ్డి,గోపు నారాయణరెడ్డి, బైరి రవి, గుండేటి ఐలయ్య యాదవ్, దొడ్డే శంకర్ ,మాజీ సర్పంచ్ కుంచం మల్లయ్య ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.