సిరాన్యూస్,ఓదెల
రైతులు పాడి పెంపకంపై దృష్టి సారించాలి : పశువైద్యాధికారి మల్లేశం
రైతులు పాడి పెంపకంపై దృష్టి సారించాలని పశువైద్యాధికారి మల్లేశం అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర గ్రామంలో కరీంనగర్ పశు గణనభివృద్ధి సంస్థ సూపర్వైజర్ రాఘవ ఆధ్వర్యంలో కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించిన దూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఓదెల మండల పశువైద్యాధికారి మల్లేశం మాట్లాడుతూ పశువులకు గాలి కుంటు వ్యాధులు రాకుండా టీకాలు వేసుకోవాలని, రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువుల పెంపకం పై దృష్టి సాధించాలని అన్నారు అనంతరం సూపర్వైజర్ రాఘవ మాట్లాడుతూ పాడి రైతులకు దూడల పెంపకంపై అవగాహన కల్పించారు. నట్టలనివారణ మందులను, మినరల్ మిక్చర్ పౌడర్ ను అందించారు. గోపాలమిత్ర ద్వారా పశువులకు కృత్రిమ గర్భధారణ ద్వారా ఆడ దూడలు జన్మించే వీర్యం అందుబాటులోకి వచ్చిందిన్నారు. దీని విలువ 600 రూపాయలు ఉంటుందని, ప్రభుత్వ రాయితీపై రైతులకు 250 రూపాయలకే అందిస్తున్నామని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు 315 , గర్భకోశ వ్యాధి చికిత్సలు 46, కృత్రిమ గర్భధారణ 4, దూడల నట్ట నివారణ మందులు 36, తాగించారు. కార్యక్రమంలో గోపాలమిత్రులు ప్రవీన్, ఓదేలు,మహేశ్, పశుసంవర్ధక శాఖ ఆఫీస్ సిబ్బంది ,మునేదర్, స్రవంతి, నాగరాజు , గణేష్,పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.