సిరా న్యూస్,యాదాద్రి;
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం అయన కుటుంబ సమేతంగా హెలికాప్టర్ లో ఉదయం 8:45 గంటలకు శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామి వారి దర్శనం,ప్రత్యేక పూజల అనంతరం 10:00 గంటలకు వైటీడీయే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 1:00 గంటకి వలిగొండ మండలం సంగెం గ్రామం చేరుకుంటారు. మూసి పరివాహక ప్రాంత రైతులతో మూసీ నది వెంట పాదయాత్ర ద్వార భీమలింగం, ధర్మారెడ్డి కాల్వల్ని సందర్శిస్తారు. అనంతరం మూసి పరివాహ ప్రాంతా రైతులతో సమావేశం అవుతారు. మూసి మురికి కూపంలో కొట్టుమిట్టాడుతున్న రైతుల యోగా క్షేమాలు అడిగి తెలుసుకుంటారు. రైతులతో సమావేశం అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
================