ఆహారాన్ని పండించే రైతు.. అందరికి ఆరాధ్యుడు.. -ఎమ్మెల్యే పాయల్ శంకర్

సిరా న్యూస్, ఆదిలాబాద్:

ఆహారాన్ని పండించే రైతు.. అందరికి ఆరాధ్యుడు..
-ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆహారాన్ని పండించే రైతు అందరికి ఆరాధ్యుడుని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా, వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక కిసాన్ చౌక్ వద్ద జాతీయ రైతు దినోత్సవ వేడులను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే  పాయల్ శంకర్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మనిషి మనుగడకు మూలాధారం ఆహరం అని, ఆ ఆహారాన్ని పండించే రైతు అందరికి ఆరాధ్యుడనీ ఆయన అన్నారు. ఈ రైతు దినోత్సవాన్ని కేవలం రైతులే కాకుండా ప్రతి ఒక్కరు నిర్వహించాలని అన్నారు. రైతాంగం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందనీ అన్నారు. అటు కేంద్రం లో ఇటు రాష్ట్రంలో ఏ ప్రభుత్వమున్నా, రైతులకోసం సబ్సిడీలు, మద్దతు ధర వంటి వాటి పై సరైన నిర్ణయాలు తీసుకుంటేనే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *