సిరాన్యూస్,బేల
మరాఠి మీడియం నకిలీ సర్టిఫికెట్స్ తో డీఎస్సీ ఉద్యోగాలు: డీఎస్సీ అభ్యర్థి సురాజ్ వాంకడే
మరాఠి మీడియంలో నకిలీ సర్టిఫికెట్స్ పెట్టి డీఎస్సీ ఉద్యోగాలు సాధించారని డీఎస్సీ అభ్యర్థి సురాజ్ వాంకడే ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయంలో గురువారం ఏర్పాటు విలేకరుల సమావేశంలో డీఎస్సీ అభ్యర్థులు మాట్లాడారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మరాఠి మీడియంలో నకిలీ సర్టిఫికెట్స్ తో డి.ఎస్సి ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్స్ లను రీ వెరిఫికేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. అసలు డి.ఎస్సి జీ.వో లను జిల్లా విద్యాధికారి పరిగణలోకి తీసుకోలేదని, అందుకే లోకల్ అభ్యర్థులను కాకుండా నాన్ లోకల్ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిగణలోకి తీసుకొని హడావిడిగా పోస్టింగ్ లు ఇచ్చారని ఆరోపించారు.ఇందులో ఉన్నత అధికారులు ముడుపులు తీసుకోని దగ్గరి బందువులకు పోస్టింగ్ ఇచ్చారని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోని మరాఠి మీడియంలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్స్ ను రీవెరిఫికేషన్ చేపట్టాలని కోరారు.మరాఠి మీడియంలో చదువుకున్న తాము తెలంగాణ రాష్ట్రంలో కేవలం టీచర్ ఉద్యోగాలకు మాత్రమే అర్హత ఉంది,మిగితా ఏ నోటిఫికేషన్ వచ్చిన దానికి అర్హత లేదు అలాంటిది ఇందులో కూడా మోసం జరిగింది అని ఆరోపించారు. మరాఠి మీడియంలో ఉద్యోగాలు పొందిన కొందరు నాన్ లోకల్ వారు ఉన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోని మరాఠి మీడియం ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్స్ లను రీ వెరిఫికేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు.అదేవిదంగా మరాఠి మీడియంలో తప్పుడు వెరిఫికేషన్ చేసిన అధికారుల పైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని యెడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున్న నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల మరాఠి మీడియం డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.