మాచవరం ఎంపీడీవో శ్రీనివాసరావు వెల్లడి
సిరా న్యూస్,మాచవరం;
కృష్ణానదిపై ప్రయాణాలు కొనసాగించేందుకు మాచవరం మండలం గోవిందాపురం బల్లకట్టు వేలంపాట ఈనెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు గురువారం తెలిపారు. 2024- 2025 సంవత్సరానికి గాను ఈ వేలం పాట నిర్వహిస్తున్నామన్నారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో 12వ తేదీ అనగా మంగళవారం ఉదయం 10:30 కు బహిరంగ వేలం పాట సీల్డ్ కవర్ టెండర్ వేయాలన్నారు. నవంబర్ ఒకటో తేదీ నుండి మార్చి 2025 వరకు ఐదు నెలల పాటు కొనసాగుతుందన్నారు. ఆసక్తిగలవారు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాసరావు సూచించారు.