అయ్యప్ప స్వాములకు గాయాలు
సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి జిల్లా గూడూరు చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒంగోలు నుంచి శబరిమలై వెళ్లే సమయంలో చిల్లకూరు కోట క్రాస్ రోడ్ వద్ద ఇసుక లారీనీ బస్సు వెనకనుండి డి కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 108 సిబ్బంది వారిని గూడూరు ప్రభుత్వాసులకు తరలించారు. ఇందులో స్వాములు లకు 30 మంది దాకా గాయాలైనట్టు తెలియజేశారు అంతేకాకుండావీరిలో డ్రైవర్ కి తీవ్ర గాయాలు అయ్యాయని తలకు బాగా గాయమైందని అతనిని నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలిస్తున్నట్టు తెలియజేశారు. అందరూ ఒంగోలు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.