సిరాన్యూస్, చర్ల
తాలిపేరు రిజర్వాయర్‌లో చేప పిల్లల విడుదల చేసిన ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల తాలిపేరు రిజర్వాయర్ లో 4,08,750 ఉచిత చేప పిల్లలను శుక్రవారం నియోజక వర్గ శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు భద్రాద్రి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలోవిడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు మాట్లాడుతూ విడుదల చేసిన చేప పిల్లలు పెంచుకొని స్థానిక గిరిజన మత్స్యకార సొసైటీ ద్వారా క్రయ విక్రయాలు జరిపి ఆర్థికంగా గిరిజన కుటుంబాలు ఆర్థికంగా ఎదిగి, గ్రామీణ గిరిజన ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలని అన్నారు. ప్రభుత్వం, జిల్లా మత్స్య శాఖ ద్వారా ఇస్తున్న అనేక సంక్షేమ పథకాలను ఉపయోగించుకొని, గిరిజన మత్స్యకార కుటుంబాలు అభివృద్ధిని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి ఎడి ఇంతియాజ్ ఖాన్, ఎంపీడీవో ఈదయ్య, ఎమ్మార్వో శ్రీనివాసరావు, మత్స్యశాఖ ఫీల్డ్ అసిస్టెంట్ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.