సిరాన్యూస్, ఓదెల
పెద్దపల్లిలో సదర్ సమ్మేళనం :యాదవ సంఘం మండల అధ్యక్షులు కావటి రాజు యాదవ్
పెద్దపల్లిలో సదర్ సమ్మేళనం నిర్వహించున్నారని ఓదెల యాదవ సంఘం మండల అధ్యక్షులు కావటి రాజు యాదవ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల యాదవ సంఘం మండల అధ్యక్షులు కావటి రాజు యాదవ్ మాట్లాడుతూ అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సదర్ సమ్మేళనానికి ముఖ్యమైన ప్రాధాన్యత ఉంది. దీపావళి జరిగిన తర్వాత మూడవ రోజున యమ విదియ అంటారు. కార్యక్రమం మొట్టమొదటి సారిగా పెద్దపల్లి జిల్లాలో నిర్వహించడానికి తలపెట్టినారు. కార్యక్రమం జెండా చౌరస్తా పెద్దపల్లిలో తేదీ 10 ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు సదర్ సమ్మేళనం జరుగును, యాదవ సంఘం జిల్లా నాయకత్వం ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమానికి జిల్లాలోని, మండలంలోని , అన్ని గ్రామాల నుండి కులమతారకతీతంగా పెద్ద ఎత్తున తరలిరావాలని అన్నారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఓదెలలో అనంతరం సదర్ సమ్మేళన కరపత్రం ఆవిష్కరించారు. కార్యక్రమంలో యాదవ సంఘం మండల అధ్యక్షులు రాజు యాదవ్, బాయమ్మపల్లి మాజీ సర్పంచ్ తెల్సూరి కొమురయ్య యాదవ్, కొలనూరు మాజీ సర్పంచ్ సామ శంకర్ యాదవ్, బండారి శ్రీను యాదవ్ ,రాసాల వెంకటేష్ యాదవ్ ఆయుధం సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.