సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో ఎమ్మెల్యే విజయ రమణారావు జన్మదిన వేడుకలు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగదాంబ సెంటర్ నుండి భారీ ర్యాలీగా కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరి లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హాల్ లో ఓదెల మండలంలోని 22 గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 22 కేకులు విజయ రమణారావు తనయుడు గోపి కట్ చేసి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు. అనంతరం ఓదెలమండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత విజయ రమణారావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ,అభివృద్ధి పథంలో పెద్దపల్లి నియోజక వర్గాన్ని మరింత ముందుకు తీసుకుపోతారని ఆయన అన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్లసుమన్ రెడ్డి, చీకట్ల మొండయ్య, ఓదెల మాజీ ఎంపిటిసి బోడకుంట లక్ష్మీ చిన స్వామి, శంకరయ్య, చింతం స్వామి,పెద్దపెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గుండేటి మధు యాదవ్, పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ ,గోపతి సదానందం, బండారి కుమారస్వామి, ఇందుర్తి శ్రీనివాస్, మినుగు సంతోష్ , గడిగొప్పుల సంతోష్,విజయేందర్ రెడ్డి, పిట్టల రవికుమార్ , సామ శంకర్ ,బైరి రవి, కుంచం మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.