సిరా న్యూస్,వరంగల్;
భద్రకాళి చెరువు లో పూడిక తీసి చెరువును ఖాళీ చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. హనుమకొండ కాపు వాడ మత్తడి ద్వారా ప్రతిరోజు 300 నుండి 500 క్యూసిక్కుల నీళ్లను ఇరిగేషన్ అధికారులు దిగువకు వదలనున్నారు. కాపు వాడ మత్తడి నుంచి అలంకార్ పెద్ద మోరీ,కాకతీయ కాలనీ, పెద్దమ్మగడ్డ, మీదుగా నాగారం చెరువులోకి నీళ్లను వదలనున్నారు. ఈ నేపధ్యంలో 15 నుండి 20 రోజుల్లో భద్రకాళి చెరువును ఖాళీ చేయనున్నారు. పూడిక తీసిన అనంతరం నీళ్లు నింపడానికి కాకతీయ కాలువ ద్వారా ప్రణాళిక సిద్ధం చేసారు. ప్రస్తుత భద్రకాళి చెరువులో 140-150 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీరు నిలువ వుంది.
అయితే, పూడికతీత పనులను స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నారు. తమకు ఉపాధి చూపించాకే చెరువులోని నీటిని తీయాలని ఆందోళనకు దిగారు.