సిరాన్యూస్, చిగురుమామిడి
మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన అవసరం:తిమ్మాపూర్ ఎక్సైజ్ ఎస్సై శ్రీకాంత్
* కాన్షియస్నెస్ క్లబ్ ఏర్పాటు
ప్రజలకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన అవసరమని తిమ్మాపూర్ ఎక్సైజ్ ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం
చిగురుమామిడి మండలంలోని డార్విన్ పబ్లిక్ స్కూల్,కేజీబీవి పాఠశాలల్లో కాన్షియస్నెస్ క్లబ్ ఏర్పాటు చేసి మత్తు పదార్థాల నిర్మూలనపై తిమ్మాపూర్ ఎక్సైజ్ ఎస్ఐ శ్రీకాంత్ అవగాహన కల్పించారు. క్లబ్లో ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు ఇద్దరు విద్యార్థులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఏదైనా మాదకద్రవ్యాల గురించి సమాచారం తెలిస్తే క్లబ్ కమిటీ సభ్యులకు తెలియజేయాలని ఎస్ఐ సూచించారు. మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి వాటికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మరో ఎక్సైజ్ ఎస్ఐ భారతి, డార్విన్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సమ్మి రెడ్డి, కేజీబీవీ స్కూల్ సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ సంపత్, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ మాలతి, రమేష్, ఎక్సైజ్ సిబ్బంది కొండల్ రెడ్డి, ధనలక్ష్మి, సురేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.