సిరా న్యూస్,వరంగల్;
ఎన్నో కష్టాలకోర్చి పత్తి పంట పండిస్తే మార్కెట్కు వచ్చిన అన్నదా త వ్యాపారుల చేతిలో వంచనకు గురవుతున్నా డు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసి ఐ) అధికారులు వ్యాపారులతో మిలాఖత్ కావడంతో పత్తి రైతులకు కష్టాలు తప్పడం లేదు. వ రంగల్ జిల్లాలో పత్తి తీయడం జోరందుకున్న ది. సెప్టెంబర్ నుంచే ప్రారంభం కావడంతో ఇ ప్పటికే ఒక దఫా పత్తి పూర్తి కాగా, రెండోసారి కూడా పత్తి ఏరుతున్నారు. అయితే పత్తి రైతు సీ జన్ ఆరంభం నుంచి మోసపోతూనే ఉన్నాడు. రైతులకు తేమ, లూజు పేరుతో సిసిఐ, వ్యాపారులు రైతులకు పంగనామం పెడుతున్నారు. సి సిఐ కేంద్రాల్లో కొనకపోవడంతో దళారులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు తయారైంది. జిన్నింగ్ మిల్లుల యజమానులు, దళారులు కుమ్మక్కై దందా చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయిఅంతర్జాతీయ మార్కెట్లో బే ళ్లు,గింజలకు ధర తగ్గిపోయిందంటూసాకులు చెబుతూ ధర తగ్గిస్తున్నారు. ప్రభుత్వం పత్తికి మద్దతు క్వింటాకు రూ.7,521ప్రకటించింది. పత్తి రైతుకు మద్దతు ధర కల్పించడంలో మార్కెటింగ్ శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. వ్యాపారులు సిండికేటుగా మారి రైతులను ని లువునా దోచుకుంటున్నారు. రైతుల నుంచి మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాల్సిన సిసిఐ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే అరోపణలు వినవస్తున్నాయి.లాభం దేవుడెరుగు.. పత్తి రైతలకు పెట్టుబడి కూడా రావడం లేదు. ఇటీవల భారీ వర్షా లు కురవడంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నాయి. వరంగల్ జిల్లాలో 1,18,700 ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారు. వర్షాలకు పత్తి జాలుపట్టి పూత, కాత రాలిపోయింది. తెగుళ్లబారిన పడడంతో సుమారు 50 శాతం పంట దిగుబడి తగ్గిందని రైతులు వాపోతున్నారు. ప్రారంభంలో వర్షాలు కురవకపోవడంతో మొక్కదశలో ఎండిపోయింది. తర్వాత కాస్త వర్షాలు కురవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నా రు.ఇప్పుడు భారీ వర్షాలు కురవడంతో పూత, కాత దశలో ఉన్న పత్తిని కాపాడుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడుగా పంటలో కలుపును ఏరివేసేందుకు మందుల పిచికారీతో పాటు కూలీల ఖర్చులు అధికంగా పెరిగాయి. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితి ఉందని రైతులు దిగాలు చెందుతున్నారు. మూడు కాతలు వరకు పంట దిగుబడి రావాల్సి ఉండగా కేవలం ఒకే కాతకు పంట పరిమితమైంది. ఎకరాకు సుమారు 15 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి రావాల్సి ఉండగా కనీసం 5 క్విం టాళ్లు కూడా దిగుబడి వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు.