సిరా న్యూస్,మెదక్;
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి బూతులు ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని అన్నారు.
రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి మంత్రులు, ముఖ్యమంత్రి గాలిమోటలలో తిరుగుతున్నారు. మూసి దురవస్థకు కారణం కాంగ్రెస్, తెలుగుదేశం పాలనే. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మూసి నది సమస్యలపై పాదయాత్రకు సిద్ధం. మూసి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటికంప ఎక్కువ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం.కేటీఆర్‌పై కక్ష సాధింపుతోనే ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ప్రజాబలంతోనే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటామని అన్నారు.