MLA Amilineni Surendra Babu: వాటర్ షెడ్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని

సిరాన్యూస్, కళ్యాణదుర్గం
వాటర్ షెడ్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని
*పారంపాండులతో భూగర్భ జలాలు పెంచుకోవచ్చు

పారంపాండులతో భూగర్భ జలాలు పెంచుకోవచ్చుఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. శ‌నివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ళ గ్రామంలో వాటర్ షెడ్ ద్వారా మంజూరైన ఫారంపాండు నిర్మాణానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ రైతులకు అత్యంత ముఖ్యమైనది ఈ ఫారంపాండు.. ఫారంపాండుల ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయ‌ని, వాటర్ షెడ్ ద్వారా రైతులకు అవసరమైన తార్పాళ్ళు, స్ప్రేయర్లు, వివిధ రకాల పనిముట్లు అందిస్తారని, అందులో భాగంగా మొత్తం 6.36కోట్లు మంజూరు అయ్యాయి వచ్చే మార్చి నాటికి పనులు పూర్తయ్యేలా గ్రామ సర్పంచ్, నాయకులకు చెప్పడం జరిగింది. ఫారంపాండులకు మూడు కోట్లతో, పనిముట్లకు రెండు కోట్ల రూపాయలు, మహిళా సంఘాల ద్వారా జీవనోపాదులకు 92 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఎలాంటి పనులు చేయకపోగా, పూర్తిగా గోళ్ళ గ్రామంలో సర్పంచ్, గ్రామ నాయకులు పోరాడి వాటర్ షెడ్ పనులు ప్రారంభానికి కృషి చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *