సిరాన్యూస్, ఆదిలాబాద్
పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్
బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వజ్రా బాంకెట్ హాల్ లో బీజేపీ పార్టీ సంస్థ గత ఎన్నికల వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల లలోనే భారతదేశంలోనే అత్యధిక సభ్యత నమోదు గల పార్టీ ఏదైతే ఉందంటే అది బిజెపి అని అన్నారు. బీజేపీ పార్టీ నుంచి ఎటువంటి ది ఏమి ఆశించకుండా ఎప్పుడైతే మనం సభ్యుణ్ణి చేర్చగలుగుతాము ఆ సభ్యుడు శ్రమించి పార్టీకి పనిచేస్తాడు అన్నారు. పార్టీ ఏదో ఇస్తదని పార్టీలో చేర్పిస్తే ఆ సభ్యుడు ఎక్కువ రోజులు పార్టీకి అనుసంధానమై ఉండడు అన్నారు. ఒక్కసారి బిజెపి పార్టీ సభ్యునిగా చర్చితే కనీసం 25 సంవత్సరాలు పాటు పని చేస్తారన్నారు. ఇప్పటివరకు పార్టీకి భవిష్యత్తులో ఇంకా సేవలందించినందుకు ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని ఎన్నికల సమయంలోనే సభ్యత నమోదు కార్యక్రమాలు మనం చేపట్టమన్నారు. సమస్యలు పరిష్కరించడానికి ప్రతి ఒక్క భారతీయ పార్టీ కార్యకర్త పనిచేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారు భారతదేశం వైపు నేడు ఆసక్తిగా చూస్తున్నారంటే అది కేవలం మోదీ అందిస్తున్న పాలన అని గుర్తు చేశారు.పార్టీల చేరిన ప్రతి సభ్యునికి దేశంలో , రాష్ట్రంలో భారతీయ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను సమాచారాన్ని తెలియజేస్తామన్నారు. బిజెపి పార్టీలో పని చేసే నాయకత్వ వచ్చిన అవకాశం జన్మలో చేసిన పుణ్యమో చేసుకుంటే ఇటువంటి అవకాశం రాదన్నారు. ఎన్నికలు ఫలితాలు సరైన రీతిలో రావాలంటే, నాయకుడు బలంగా ఉండాలంటే పార్టీ సంస్థగత బలంగా ఉంటేనే మిగతా అన్ని సజావుగా సాగుతాయి అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, మయూరి చంద్ర ఆదినాథ్ విజయ్ వేణుగోపాల్ నగేష్, లాలమున్న, సువసిని రాకేష్, వేద వ్యాస్, ఆకుల ప్రవీణ్, జోగు రవి, కృష్ణ యాదవ్, రాందాస్, రవి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు