EX MLA Joguramanna : సీఎం రేవంత్‌రెడ్డి చిత్రాల‌ను ద‌హ‌నం చేసిన మాజీ ఎమ్మెల్యే జోగురామన్న

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
సీఎం రేవంత్‌రెడ్డి చిత్రాల‌ను ద‌హ‌నం చేసిన మాజీ ఎమ్మెల్యే జోగురామన్న
* రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలి
* లేనియెడల ఆందోళన ఉదృతం చేస్తాం

సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేరే వాళ్ళ చావులు కోరడం తన విజ్ఞతకే వదిలేస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి… హింసను ప్రేరేపించేలా, ప్రజలను రెచ్చగొట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌, హరీష్ రావు లపై సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో నిరసన చేపట్టారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు.సీఎం చిత్రాలను ద‌హ‌నం చేసి ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. .ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేక విధానంతో తీవ్ర అసంతృప్తికి గురవుతూ సీఎం హోదాలో ఉండి ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజలను హింసను ప్రేరేపించేలా కెసిఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన కెసిఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని, సీఎం ను గౌరవించే పరిస్థితి లేకుండా చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి.. హామీల అమలులో విఫలమవ్వడమే కాకుండా ప్రధాన ప్రతిపక్ష నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సమర్ధించుకుంటున్నారని మండిపడ్డారు. ఈ 420 సీఎం రేవంత్ రెడ్డి హింసను ప్రోత్సహించేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆదిలాబాద్ ఎస్పీ ఆలం గౌస్ ను జోగు రామన్న కలిసి సీఎంపై కేసు నమోదు చేయాలని కోరారు.ధర్నాలో మాజీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, అలాల్ అజయ్, విజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, గండ్రత్ రమేష్, దాసరి రమేష్, కొండా గణేష్, పవన్ నాయక్, దమ్మాపాల్, బట్టు సతీష్, సలీమ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *