సిరాన్యూస్, ఓదెల
కౌసల్య చూపు సజీవం : సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మెరుగు భీష్మాచారి
* ఇద్దరు అంధులకు వెలుగులు
* దుఃఖంలో కూడా నేత్రదానం చేసి స్ఫూర్తిగా నిలిచిన కుటుంబం
* అభినందించిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు
పెద్దపెల్లి జిల్లా ఓదెల నివాసి కొనిశెట్టి రమేష్ తల్లి కౌసల్య మరణిచింది. ఇంట్లో అందరితో కలిమిడిగా ఉంటూఅందరి మన్ననలు పొందారు. అనారోగ్యంతో శనివారం ఆమె మృతి చెందగా, తన నేత్రాలను ఇద్దరు అంధులకు దానం చేసి వారికి వెలుగులు ప్రసాదించి.. మరణంలో కూడా అందరికీ స్ఫూర్తిని చాటుకున్నారు కొనిశెట్టి కౌసల్య. కమాలాపూర్ మండలం దేశరాజ్ పల్లె ఆమె నేత్రాలను దానం చేస్తే ఇద్దరికి చూపును ప్రసాధించవచ్చని, మృతుని కుటుంబ సభ్యులకు వారి దగ్గరి మిత్రులు ఆకుల మహేందర్ సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మేర్గు భీష్మాచారి అవగాహన కల్పించారు. దీంతో స్పందించిన కుటుంబ సభ్యులు నేత్రదానంకు అంగీకరించగా, భీష్మాచారి ఆధ్వర్యంలో మృతురాలి నేత్రాలను సేకరించిన టెక్నీషియన్ నరేందర్ హైదరాబాద్ లోని ఐ ఇనిస్ట్యూట్ కు తరలించారు. ఇంటి పెద్దను కోల్పోయిన దుఃఖంలో కూడా ఆమెనేత్రాలను దానం చేసిన , కొడుకులు, కోడండ్లు రమేష్. రాజమణి, సురేష్, వాణి, అంజన్న,లావణ్య సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి.శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సీహెచ్. లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు సానా రామకృష్ణా రెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేష్, జాతీయ కార్యదర్శి మేర్గు భీష్మాచారి, ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు మండల కార్యదర్శి మల్లేశం తదితరులు అభినందించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.