సిరాన్యూస్,ఆదిలాబాద్
అబుల్ కలాం ఆజాద్ ఆశయాలకనుగుణంగా నడుచుకోవాలి : కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్
* కంది శ్రీనివాస రెడ్డి క్యాంపులో కలాం ఆజాద్ జయంతి వేడుకలు
* ఉర్దూ రిపోర్టర్లకు ఆత్మీయ సత్కారం
ఉర్దూ భాషాభివృద్ధికి భారత రత్న ,భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖా మంత్రి, స్వాతంత్య్ర సమరయోధులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎంతో కృషి చేసారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయం,ప్రజా సేవ భవన్ లో నిర్వహించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు.ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఉర్డూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లను పూలమాలలు, శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందచేసారు. ఉర్దూ భాషకు అబుల్ కలామ్ ఆజాద్ అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలకనుగుణంగా నడుచుకోవాలని కోరారు. తమను గుర్తించి సత్కరించినందుకు ఉర్దూ పాత్రికేయులు కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని,కౌన్సిలర్లు బండారి సతీష్,సంద నర్సింగ్,జాఫర్ అహ్మద్,నాయకులు ఎం.ఏ షకీల్,కిజర్ పాషా,ఎం.ఏ కయ్యుమ్,మొహమ్మద్ రఫీక్,షేక్ ఖలీం,ఇర్ఫాన్ ఖాన్,తకిముద్దీన్,సయ్యద్ షాహిద్ అలీ,అతిక్ ఉర్ రహమాన్,సయ్యద్ షౌకత్ అలీ,అజిజ్ ఖాన్,కర్మ,అఖిమ్,అంజద్ ఖాన్,అయాస్ ఖాన్,భరత్ శ్రవణ్ నాయక్,బండారి చిన్నయ్య,అస్బాత్ ఖాన్,అజిజ్,అంజా,అల్లాబకష్, తదితరులు పాల్గొన్నారు