తెలంగాణలో జిన్నింగ్ మిల్లర్ల సమ్మె ప్రకటన

సీసీఐ అధికారులతోమాట్లాడిన మంత్రి తుమ్మల
సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో పత్తి జిన్నింగ్ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సీఎండీ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో మాట్లాడారు.
సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండ, పత్తిని తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి తలెత్తకూడదని, పత్తి జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపి, పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. రైతులు ఇబ్బందులకు గురికాకుండా, కష్టాలు పడకుండా మరియు పత్తిని దిగువ ధరలకు విక్రయించవలసిన అవసరం లేకుండా చర్యలు వెంటనే తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇది రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కీలకమని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *