సిరా న్యూస్,వికారాబాద్;
పరిగి మండలం కుదన్పూర్ శివారులో దారుణ విషాదం జరిగింది. తనకు ఎవరు దిక్కు లేక మానసిక క్షోభతో తల్లి కూతుర్లు ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం రాత్రి సమయంలో పది సంవత్సరాల కూతురు భవానీని తల్లి లలిత నడుముకు కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. లలీత స్వగ్రామం చౌడపూర్ గత 8 సంవత్సరాల క్రితం భర్త మరణించడంతో ఒంటరిగా గడుపుతోంది. మూజాహిద్పూర్ గల్స్ హాస్టల్లో చదువుతున్న కూతురిని నిన్న రాత్రి తీసుకుని వచ్చి అత్మహత్యకు పాల్పడింది.