సిరాన్యూస్, బేల:
బాజీరావ్ బాబా చూపిన సన్మార్గంలో నడవాలి
-ఠాక్రే దత్తా మహరాజ్
ప్రజలంతా బాజీరావ్ బాబా చూపిన సన్మార్గంలో నడవాలని సప్తా నిర్వాహకులు ఠాక్రే దత్తా మహరాజ్ అన్నారు. ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం లోని మణ్యార్పూర్ గ్రామంలో నిర్వహించిన బాజీరావు బాబా సప్తహా ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా చిత్రపటాన్ని బంతిపూలతో అలంకరించిన పల్లకిలో ప్రతిష్టించి, గ్రామంలో ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, భాజ భజంత్రీలు నడుమ శోభాయాత్ర కొనసాగింది. మహిళలు మంగళ హారతులతో ముందు నడవగా, యువకులు భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తేజ్ రావ్ వడ్కర్, పార్టీల నాయకులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.