సిరా న్యూస్;
గ్రహణ గండాలకు అతీతంగా ఎప్పుడు భక్తులకు దర్శనమిచ్చే శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆరుద్రను పురస్కరించుకుని బుధవారం స్వామి అమ్మవార్ల ప్రధాన ఆలయాలను మూసేశారు. శ్రీకాళహస్తీశ్వరుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రను పురస్కరించుకుని ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత స్వామి వారి ధ్రువ మూర్తులకు వేడి నీళ్లతో ఏకాంతంగా అభిషేకాలు జరపడం ఇక్కడి సంప్రదాయం. ఉష్ణోదక అభిషేకాలను పురస్కరించుకుని దాదాపు 4 గంటలకు పైగా స్వామి అమ్మవార్ల ఆలయాలు మూసేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు వారు ఉత్సవమూర్తులను దర్శించుకుని వెళ్లాల్సి వచ్చింది. ఆరుద్ర సందర్భంగా ఆలయ ఆవరణలో బుధవారం శ్రీ శివకామ సుందరి సమేత నటరాజస్వామి ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకాలు జరిపి పురవీధుల్లో ఊరేగించారు