సిరా న్యూస్, ఆదిలాబాద్:
మంత్రి సీతక్కతో స్టేజిపై కంది శ్రీనివాసరెడ్డి…
+ ప్రజా పాలన కార్యక్రమంలో సీతక్కతో స్టేజ్ షేర్ చేసుకున్న కంది
+ ఆదిలాబాద్ లో కంది టైం స్టార్ట్ అయిందంటున్న అభిమానులు
+ అధికారిక కార్యక్రమంలో స్టేజ్ పై కూర్చోవడంతో హల్చల్
+ “ప్రజా పాలన” కాదు “పార్టీ పాలన” అంటున్న ప్రతిపక్షాలు
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి మంత్రి సీతక్కతో అధికారిక కార్యక్రమంలో స్టేజ్ షేర్ చేసుకోవడం హల్చల్ గా మారింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం జామ్ని గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా నిర్వహించిన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్కతో కలిసి కంది శ్రీనివాస రెడ్డి స్టేజిపై కూర్చున్నారు. ఇలా అధికారిక కార్యక్రమంలో ఏకంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి తో కలిసి స్టేజిపై కూర్చోవడం కార్యకర్తలు, అభిమానులు, నాయకుల్లో జోష్ నింపింది. ఆదిలాబాద్ లో కంది శ్రీనివాసరెడ్డి టైం స్టార్ట్ అయిందని, రానున్న రోజుల్లో కంది శ్రీనివాసరెడ్డిని ఎదుర్కోవడం ప్రతిపక్షాలకు కష్టమే అని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే అనతి కాలంలోనే ఆదిలాబాద్ రాజకీయాలు శాసించే స్థాయికి కంది శ్రీనివాసరెడ్డి ఎదిగారని అభిమానులు సంబరపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ప్రస్తుతం ఆదిలాబాద్ లో కంది శ్రీనివాస్ రెడ్డి ఏకచత్రాధిపత్యం కొనసాగే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే ఇతర పార్టీల నాయకులు మాత్రం… ఏ హోదాతో కంది శ్రీనివాస్ రెడ్డి అధికారిక కార్యక్రమంలో స్టేజిపై మంత్రి పక్కన కూర్చుంటారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు ప్రోటోకాల్ మరిచి వ్యవహరిస్తున్నారని, ఇదీ “ప్రజాపాలన” కాదు “పార్టీ పాలన” అని విమర్శిస్తున్నారు.