సిరా న్యూస్,హైదరాబాద్;
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో గుర్తు తెలియని వ్యక్తి ఓంటికి నిప్పంటించుకుని హల్ చల్ చేశాడు. తీవ్రగాయాలైన అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. రోడ్లమీద భిక్షాటన చేస్తూ జీవనం సాగించే వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా శ్మశాన వాటికలో చనిపోయిన వారికోసం ఏర్పాటు చేసిన మందు కళ్ళు తాగి అక్కడే పడిపోయాడు బాధితుడు. శ్మశానంలో ఉన్న దీపం అతని మీద పడడంతో మంటలు ఒంటిపైకి పాకాయి.దీంతో రోడ్డుమీదికి పరుగులు తీశాడు అతను. అయితే అక్కడే పని చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది మంటలు ఆర్పివేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.