సిరాన్యూస్, కుందుర్పి
జంబుగుంపలలో ఇంటింటా టీడీపీ సభ్యత్వ నమోదు
కుందుర్పి మండలంలోని జంబుగుంపల గ్రామంలో శుక్రవారం టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలను ప్రజలకు అందిస్తున్నారు. ఇందులో భాగంగా మెంబర్షిప్ డ్రైవ్ కొనసాగుతున్నది. సభ్యత్వం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అట్టడుగు వర్గాల ప్రజలు సభ్యత నమోదులో ఎక్కువగా భాగస్వాముల వుతున్నారు. కార్యక్రమంలో కుందుర్పి మండల టీడీపీ అధ్యక్షులు జి ధనుంజయ, పంచాయతీ ప్రధాన కార్యదర్శి దురుగేష్, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ వెట్టి హనుమంతరాయుడు, పార్టీ సీనియర్ నాయకులు బొమ్మలింగప్ప, జిలన్ భాష, తిప్పేస్వామి యాదవ్, మంజునాథ్, పంచాయతీ వార్డ్ మెంబర్ ఉమాదురుగేష్, ఓబులేష్, తిప్పేస్వామి, శ్రీరాములు, పాలాక్షి, తిప్పేస్వామి, రమేష్, మురళి, దేవరాజు, బాలరాజు, రామక్రిష్ణ, జగదీశ్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.