సిరా న్యూస్,సూర్యాపేట;
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం డి.కొత్తపల్లి శివారులోని శ్రీరామ్ సాగర్ కాల్వ పై మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. తిరుమలగిరి మున్సిపాలిటీ చెందిన వనగండ్ల కుమార్(28) గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు.ఘటన స్థలానికి సూర్యాపేట డి.ఎస్.పి రవి,నాగారం సీఐ రఘువీర్ రెడ్డి, నాగారం ఎస్సై ఐలయ్య క్లూస్ టీం తో చేరుకునీ హత్యకు గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.