సిరా న్యూస్,హైదరాబాద్;
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. వీరిద్దరి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనలో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఎమ్మెల్యే గాంధీతో పాటు 30 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఆల్వీన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తదితరులు ఉన్నారు. వీరిపై బీఎన్ఎస్ సెక్షన్లు 189, 191(2), 191(3), 61,132,329,333,324(4)324(5)351(2) r/w 190 కింద గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే ఎఫ్ఎఆర్ నెంబర్ 1393 కింద శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, దొడ్ల వెంకటేష్ గౌడ్ తదితరులపై బీఎన్ఎస్ 190 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.