సిరా న్యూస్,పిఠాపురం;
పిఠాపురం పట్టణం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పరిధిలో అడ్డూ అదుపూ లేకుండా, సరైన అనుమతులు పొందకుండా, నివాస ప్రాంతంలో ఇష్టానుసారంగా లాడ్జీలు నిర్మించేస్తూ స్థానికులను,ఆలయాలకు వచ్చే భక్తులను తీవ్ర ఇబ్బందులకు,భయభ్రాంతులకు గురిచేస్తూన్నారు.శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం ఎదురుగా ఇరుకుగా ఉండే సందులో 16 గదులతో,మూడు అంతస్తుల్లో లాడ్జి కోసం నిర్మిస్తూన్న ఒక భవనం దాని పక్కనే ఉన్న మరో భవనం మీదకి ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది.ఈ భవనం ఎఫెక్ట్ కి ప్రక్క భవనంతో సహా చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా ఇప్పటికే దెబ్బతినడంతో ఆ ఇళ్ళల్లో నివాసముంటున్న వారంతా కూడా ఆ భవనం ఏ సమయంలో కూలిపోతుందోనని ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటూన్నారు.కొందరైతే వేరేచోటుకు వెళ్ళిపోయి తలదాచుకుంటున్నారు.అంతేగాక.,ఆ వీధిలోంచి వచ్చే ప్రజలు,భక్తులు కూడా భయాందోళనలు చెందుతూన్నారు.భారీగా ప్రమాదం తలెత్తే పరిస్థితులు ఉన్నాయని తెలిపినా ఏ ఒక్క అధికారీ కూడా కనీసం వచ్చి,చూసిన పాపాన పోలేదంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలుస్తోంది.ఆ భవనం విషయమై అధికారులు ఏ విధమైన చర్యలూ తీసుకోకపోవడంతో అధికారులపట్ల పలు అనుమానాలకు తావిస్తోంది.